![]() |
![]() |

ఉస్తాద్ నెక్స్ట్ వీక్ ప్రోమోతో మంచు మనోజ్ వచ్చేసాడు. ఇక ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ అలియాస్ డిజె. టిల్లు ఎంట్రీ ఇచ్చాడు.స్టేజి మీదకు రాగానే "ఎక్కడో రెండు మూడు బొక్కలున్నాయి..పడిపోతానేమో అని టెన్షన్ గా ఉందంటూ" కామెడీ చేసాడు టిల్లు.. "నీకు బొక్కలిష్టం అని సెట్ చేశారు బాబాయ్" అంటూ మంచు మనోజ్ రివర్స్ కౌంటర్ వేసాడు. "స్క్రిప్ట్ నువ్వు మొదలు పెట్టేముందు నువ్వు రాసేది కే ఐ ఎస్ ఎస్" అంట కదా అని మనోజ్ అడిగేసరికి టిల్లు తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఆ పక్కన స్క్రీన్ మీద డిజె టిల్లు మూవీ నుంచి రాధికాతో ముద్దు సీన్స్ ని వేసి చూపించారు. తర్వాత ఐరన్ రాడ్ ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి "మీ లైఫ్ లో మీకు వచ్చిన బెస్ట్ ప్రొపోజల్ ఏమిటి టిల్లు" అని అడిగింది. " నాకు ఎవరూ ప్రొపోజ్ చేయలేదు" అని ఆన్సర్ ఇచ్చాడు. "ప్రొపోజ్ చేసేంత టైం ఇవ్వలేదు వాళ్లకు" అంటూ మనోజ్ కవర్ చేసాడు. ఇక మనోజ్ ఒక కార్డు తీసుకునేసరికి "ఏ చూసావా" అని అడిగేసరికి "ప్రామిస్ చూడలేదు" అన్నారు టిల్లు.."రాధికా మీద ప్రామిస్ చెయ్యి" అనేసరికి వెనక నుంచి రాధికా రాధికా అనే సాంగ్ ని ప్లే చేశారు. తర్వాత టిల్లు ఎవరితోనే ఫోన్ లో మాట్లాడాడు.. "ముందుగా ఇది షోలా లేదు...ఇంట్లో సోఫాలో దొర్లుతున్నట్టు దొర్లుతున్నాడు. "ఇంతకు బయట నీకు ఎన్ని రాడ్లు పడ్డాయి" అంటూ మనోజ్ అడిగేసరికి టిల్లు నవ్వేసాడు. ఈ వారం ఇలాంటి డబుల్ మీనింగ్ కామెడీ పంచ్ డైలాగ్స్ తో ఈ షో ఆడియన్స్ ని అలరించడానికి రాబోతోంది. ప్రోమో లాస్ట్ లో మంచు మనోజ్ నటించిన మూవీలోని సాంగ్ "ప్యార్ మీ పడిపోయానే" అంటూ పడుతూ ఉంటె టిల్లు మాత్రం తబలా వాయిస్తూ మ్యూజిక్ ఇచ్చాడు.
![]() |
![]() |